కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కోతుల మందపై విష ప్రయోగం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విషాహారం తిన్న పది కోతులు చనిపోగా.. పదుల సంఖ్యలో కోతులు తీవ్రఅస్వస్థతకు గురయ్యాయి. కోతులకు చికిత్స అందించి కాపాడారు వెటర్నరీ డాక్టర్లు.. కామారెడ్డి జిల్లా అంతంపల్లి గ్రామ శివారు లో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులో ఓ దాబా హోటల్ దగ్గర గురువారం ళళ(జనవరి 22) పది కోతులు చనిపోయాయి. పదుల సంఖ్యలో కోతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. కోతులపై విషప్రయోగం జరిగిందని విషయం తెలుకున్న అంతంపల్లి గ్రామ సర్పంచ్.. పశు వైద్య అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని వైద్యాధికారులు ప్రాణాపాయ స్థితిలో కోతులకు చికిత్స అందించి కాపాడారు.
ALSO READ : జీవధారగా జంపన్న వాగు ..
ఇటీవల కుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు వెలుగులోకి వస్తున్న క్రమంలో కోతులపై విషప్రయోగం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. మూగజీవుల సంరక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
