పిట్లం, వెలుగు: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని తెలంగాణ మైనార్టీ గురుకుల స్కూల్లో ఇంటర్ చదువుతున్న మోజాహిద్(15) గురువారం పరీక్ష రాసేందుకు స్కూల్ నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో శనివారం పిట్లం మండలం పెద్ద దడ్గి వద్ద కౌలాస్ నాలా కాలువలో మోజాహిద్ మృతదేహం కనిపించింది. 5వ తేదీన జరిగిన పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని దావిగిరి గ్రామానికి చెందిన మోజాహిద్ తల్లిదండ్రులు లేకపోవడంతో బిచ్కుంద మండలం మెక్కా గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
