అమెరికా పనామా సిటీలోని జైలులో ఖైదీల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో 13 మంది ఖైదీలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. పనామాకి 25 కి.మీ దూరంలో ఉన్న లా జోయిటా జైలులో ఈ కాల్పులు జరిగాయి. ఖైదీల నుంచి ఐదు చేతి తుపాకులు, మూడు బారెల్ తుపాకులతో సహా మరికొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జూలైలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన లారెంటినో కార్టిజో మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడానికి కారణం జైలు గార్డ్లులేనని ఆయన అన్నారు. గార్డులు ఖైదీలకు ఆయుధాలు సరఫరా చేశారని, అందువల్లే ఈ కాల్పులు జరిగాయని ఆయన అన్నారు. ఖైదీలు వాడిన తుపాకీలు ఆకాశం నుండి పడలేదు, అవి జైలులోకి రావడానికి గార్డులు సహాయం చేశారని ఆయన తెలిపారు.
జైలు పోలీసు అధికారి అలెక్సిస్ మునోజ్ మాట్లాడుతూ.. కాల్పులు జయటనుంచి జరగలేదని, జైలు లోపల నుండే కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. జైలులో ఖైదీల మధ్య గొడవలను నివారించడానికి కొన్ని గుంపులుగా విభజించి ఉంచుతారు. అలా ఉన్న గ్రూపుల్లో.. ఒక గ్రూప్ మరోక గ్రూప్‌పై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
For More News…
