
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. విఘ్నేశ్ గవిరెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో భూమిక, సారా అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ‘ఫ్లై హై’ అంటూ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. కాల భైరవ కంపోజ్ చేసిన ఈ ట్రెండీ సాంగ్‌కు కిట్టు విస్సా ప్రగడ క్యాచీ లిరిక్స్ అందించాడు. కాల భైరవ, పృథ్వీ చంద్ర, గాయత్రి నటరాజన్ కలిసి పాడిన తీరు యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో గుణ శేఖర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కంప్లీట్ యూత్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీని తీస్తున్నా. ఆడియెన్స్‌ను ఏ మాత్రం నిరాశపర్చదని భావిస్తున్నా’ అని అన్నారు. యూత్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని హీరో విఘ్నేష్ గవిరెడ్డి చెప్పాడు. ఈ పాటకు మంచి బజ్ రావడం ఆనందంగా ఉందని నిర్మాత నీలిమ గుణ అన్నారు. ఇందులోని పాటలన్నీ అందరికీ నచ్చుతాయని మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ చెప్పాడు.