
గుండాల, వెలుగు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి పేషెంట్లతో నిండిపోతున్నా చూసేందుకు డాక్టర్లు కరువయ్యారు. మండలంలో 50 గిరిజన పల్లెలు ఉండడంతో అందరూ సర్కార్ ఆస్పత్రి పైనే ఆధారపడి ఉంటారు. ఇక్కడ ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారు షిఫ్టుల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారు.
ఒకరు వరంగల్ నుంచి, మరొకరు ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం 11 గంటల సమయానికి 157 మంది పేషెంట్లు ఆస్పత్రికి వచ్చినా డాక్టర్ కుర్చీ మాత్రం ఖాళీగానే ఉంది. దీంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. చూసే ఒక్క డాక్టరైనా స్థానికంగా ఉంటే బాగుంటుందని మండల ప్రజలు కోరుతున్నారు.