జల జల పారే జలపాతం..హైదరాబాద్కు అతిదగ్గర్లో (వీడియో)

జల జల పారే జలపాతం..హైదరాబాద్కు అతిదగ్గర్లో  (వీడియో)

పచ్చని ప్రకృతి..చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం.  ఎత్తయిన కొండలు..ఆ కొండల నుంచి జాలు వారే  జలపాతం. చెప్తుంటేనే ఎంతో ఆసక్తి అనిపిస్తుంటే..ఆ అందాల జలపాతాన్ని కళ్లారా చూస్తే..మరింత అద్భుతంగా..ఆనందంగా ఉంటుంది. ఆ జలపాతం చూడాలంటే వరంగల్ జిల్లాకు వెళ్లాల్సిందే. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ఎన్నో జలపాతాలు పర్యాటకుల మనసును  ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికి బొగత, భీముని పాదం వంటి జలపాతాలు కనువిందు చేస్తుండగా..మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. 

ములుగు జిల్లా వాజేడు మండలంలో మరో అద్భుత జలపాతం వెలుగులోకి వచ్చింది. ‘గుండం జలపాతం’గా  పిలుస్తున్న ఈ జలపాతం  పర్యాటకులను మనసు దోచేస్తుంది. రెండు గుట్టల మధ్య నుంచి నీరు జాలువాతూ...ఆకాశగంగ దిగివస్తున్నదా అనిపిస్తుంది. 

 

అంతేకాదు ఈ గుండం జలపాతం నీరు.. సముద్రపు నీటిలాగే నీలి రంగులో ఉండడం మరింత విశేషం. ఈ జలపాత అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వాజేడు మండలం అరుణాచలపురం గ్రామానికి ఈ గుండం జలపాతం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.