గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలోని కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. కుర్చీ మడత లిరికల్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసేసింది. ఏకంగా ఈ సాంగ్ యూట్యూబ్ లెక్కలు సరి చేస్తూ 80 మిళియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది.
ఇపుడు లేటెస్ట్గా వీడియో సాంగ్ రావడంతో..కుర్చీ మడతపెట్టి (Kurchi Madathapetti) సాంగ్ కొత్త లెక్కలు క్రియేట్ చేసే పనిలో ఉంది. ఈ సాంగ్లో శ్రీలీల లంగావోణీలో కనిపించి హాట్ అప్పిరియన్స్ తో యువతని కట్టిపడేసింది. అమ్మడి నడుముమైపై మహేశ్ చేతులు..కళ్లలో కళ్లు మస్త్గా హైలైట్ అయ్యాయి. ఎరుపు రంగు లంగా వోణీలో మరింత స్పైసీగా ఆకర్శించేలా..అమ్మడి ముక్కుకి పుడక..చెవులకు జుంకాలు అన్ని శ్రీలీలని యూత్ని ఆకట్టుకునేలా చేశాయి.
సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్‌తో సాగే ఈ మాస్ బీట్ సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ లవర్స్, సూపర్ ఫ్యాన్స్ ఈ పాటతో ఫుల్ స్వింగ్ లో ఊగారు. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కుపైగా రీల్స్ చేశారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు లిరికల్ గానే ఆ రేంజ్లో కిక్ ఇస్తుందంటే? ఇపుడు పూర్తి వీడియో సాంగ్ వచ్చాక శ్రీలీల..మహేష్ సత్తా ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ సంగీతం సమకుర్చాడు.
గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.