మద్యం సీసాలతో సాయిబాబాకు అభిషేకం..

మద్యం సీసాలతో సాయిబాబాకు అభిషేకం..

మనం ఆలయానికి వెళ్తే కోరికలు తీరడానికి కొబ్బరికాయలు కొడతాం.  పూలు, లేదా పాలతో అభిషేకం నిర్వహిస్తాం. భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తాం. కానీ ఓ ఆలయంలో కొందరు భక్తులు మద్యం సీసాలతో దేవుడికి అభిషేకం నిర్వహించారు. లిక్కర్ బాటిళ్లలో ఇతర ద్రవ్యాలను తీసుకువచ్చి అభిషేకం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భక్తుల అత్యుత్సాహంపై పలువురు మండిపడుతున్నారు. 

మద్యం సీసాలతో అభిషేకం ఎక్కడంటే.. 

గురు పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను  భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ పండుగ జులై 03న  సోమవారం సాయి బాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరం గ్రామంలో సాయి బాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు.. లిక్కర్ బాటిల్స్‌లో  తేనే, ఇతర ద్రవ్యాలతో అభిషేకం చేశారు.  ఆల్కహాల్ సీసాల్లో ద్రవ్యాలను తీసుకువచ్చి  అభిషేకం చేయడం పట్ల బాబా భక్తులు మండిపడుతున్నారు.