V6 News

మీరు ఉండాల్సినోళ్లే : కారులో వెళుతూనే చిచ్చుబుడ్లు, రాకెట్స్ పేల్చిన కుర్రోళ్లు

మీరు ఉండాల్సినోళ్లే : కారులో వెళుతూనే చిచ్చుబుడ్లు, రాకెట్స్ పేల్చిన కుర్రోళ్లు

ఢిల్లీ హర్యానా రాష్ట్రాల సరిహద్దులోని గురుగ్రామ్ లో ఆకతాయిలు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో నుంచి కొందరు యువకులు పటాకులు పేల్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ కారు స్పీడ్ గా వెళ్తోంది. ఇంతలో బానెట్ పై పటాకులు పేలాయి. వరుసగా పటాకులు కాల్చుకుంటూ వెళ్లారు ఆకతాయిలు. ఈ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఆకతాయిలు పటాకులు కాలుస్తుండగా..ముందుకారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 

ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును గుర్తు పట్టకుండా ఉండేందుకే యజమాని నెంబర్ ప్లేట్ ను తొలగించాడని పోలీసులు భావిస్తున్నారు. కారు కలర్, బ్రాండ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కారు కలర్, బ్రాండ్ కార్లు గురుగ్రామ్ లో ఎన్నిఉన్నయో తెలపాలని రిజీనల్ ట్రాన్స్ ఫోర్టు అథారిటీకి గురుగ్రామ్ పోలీసులు  లేఖ రాశారు. 

కారు బానెట్ పై పటాకులు పేల్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అంటూ మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.