
సంగారెడ్డి జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ భవనం కూలిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు గదిలో నుంచి బయటకు వెళ్లిన సమయంలో భవనం కుప్పకూలిపోయింది . సమయానికి విద్యార్థులు ఆ గదిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెను ప్రమాదంత తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు.
హాస్టల్ భవనం కుప్పకూలిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా ఆరాదీశారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలని కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి దామోదర
►ALSO READ | జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నా: MLC కవిత