నేను మంత్రులకే హెడ్ మాస్టర్ను : గుత్తా సుఖేందర్ రెడ్డి

నేను మంత్రులకే హెడ్ మాస్టర్ను : గుత్తా సుఖేందర్ రెడ్డి

అసెంబ్లీలో జరిగిన బతుకమ్మ సంబురాలకు హాజరయ్యారు మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… తనపై కొందరు గవర్నర్ కు ఫిర్యాదు చేశారని అయితే తన పై విమర్శలు చేస్తున్న వారి గెలుపు కోసం గతంలో తాను పనిచేశానని .. అది మరిచి పోయి ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను మూడు సార్లు ఎంపీగా పని చేశానని.. స్థానిక ప్రజలు ఇప్పటికీ తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటారని అన్నారు. ప్రస్తుతం తాను మండలి చైర్మెన్ గా ఉన్నానని .. ఈ పదవి మంత్రులకే హెడ్ మాస్టర్ లాంటిదని చెప్పారు. తన పదవి కన్నా మంత్రి పదవి పెద్దది కాదని… రాజ్యాంగ పదవిలో ఉన్న తాను… మండలి చైర్యన్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుతానని చెప్పారు.