కాంగ్రెస్ లోకి పోయేదుంటే మా కొడుక్కి టికెట్ ఎందుకు అడుగుతా

కాంగ్రెస్ లోకి పోయేదుంటే  మా కొడుక్కి టికెట్ ఎందుకు అడుగుతా

అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తానే  కారణమైతే ఖమ్మం, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాలో ఓటమికి ఎవరు కారణమని  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.  ఎన్నికల్లో గాలి వచ్చింది.. పార్టీ ఓడిపోయిందన్నారు. అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఓడిపోయారని చెప్పారు.  ఖమ్మం , మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎంపీ సీట్లతో పాటు నల్గొండ సీటు విషయంలో కూడా టఫ్ ఫైట్ ఉందన్నారు గుత్తా.  పార్టీ అవకాశం ఇస్తే తన కొడుకు అమిత్  భువనగిరి లేదా నల్లగొండ సీటు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని చెప్పారు.  దీనిపై మరో మూడు నాలుగు రోజుల తర్వాత అధిష్టానం క్లారిటీ వస్తుందన్నారు.  

కాంగ్రెస్ కు తాను దగ్గరయ్యేది ఉంటే బీఆర్ఎస్ నుంచి తన కొడుక్కి టికెట్ ఎందుకు అడుగుతానని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.  KRMB  కేంద్రం పరిధిలోకి వెళ్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు.  సాగు, తాగు నీళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పారు.  కృష్ణా  బేసిన్ ప్రాజెక్ట్ లు KRMB పరిధిలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు.  ఉప ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరిగాయన్నారు.