బీఆర్ఎస్- కమ్యూనిస్టుల పొత్తుపై గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్- కమ్యూనిస్టుల పొత్తుపై  గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్- కమ్యూనిస్టుల పొత్తుపై  ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు  శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కమ్యూనిస్టులు మిత్రపక్షంగా ఉంటే బాగుండేదన్నారు. కమ్యూనిస్టులు  ఇండియా కూటమిలో ఉన్నందునే పొత్తు కుదరనట్టుందన్నారు.  ప్రస్తుతం వారి గురించి మాట్లనని చెప్పారు.   

తన కొడుకు కోసం టికెట్ అడగలేదని... అవకాశం వస్తే పోటీ చేస్తాడని చెప్పారు  సుఖేందర్ రెడ్డి  . అయితే ప్రస్తుతం ఆ అవకాశాలు కనపించడం లేదన్నారు. సీట్లు ఉంటే ఇస్తారని లేకపోతే పార్టీ ఏం చేస్తుందన్నారు.   నల్గొండలో అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.  

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఇటీవల కేసీఆర్ ఏకపక్షంగా  115 మంది అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తులేనట్టేనని స్పష్టమైంది.  దీనిపై వామపక్షాలు కూడా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుబట్టారు.  బీజేపీతో సఖ్యత వల్లే కేసీఆర్ తమను దూరం పెట్టారని విమర్శించారు.  వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామని సవాల్ విసిరాయి. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.