రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్

రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పెయింటింగ్ పని చేసినవాడు అన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడని గుత్తా ప్రశ్నించారు. ‘రేవంత్ నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. గుత్తా సత్తా ఏంటో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణలో కొందరి దుర్భుద్ధితో కొత్త కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి. తెలంగాణ ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, అలజడి సృష్టించేందుకే కొంతమంది కుట్రచేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు.. అటువంటి వారి కుట్రలను తిప్పికొడతారు’ అని గుత్తా కామెంట్ చేశారు.