ఏపీలో శాంతిభద్రతలు ప్రమాదకరంగా ఉన్నాయి:బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీలో శాంతిభద్రతలు ప్రమాదకరంగా ఉన్నాయి:బీజేపీ ఎంపీ జీవీఎల్

ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ఏపీలో ‘లా అండ్ ఆర్డర్’పై పూర్తి రిపోర్ట్ ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. విశాఖ భూ దందాపై గత ప్రభుత్వాలు వేసిన సిట్ రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సీఎం జగన్ భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టులు అడిగితే ఇస్తామని పేర్ని నాని అన్నారని.. అవి ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు.  ఏపీలో ఇసుక, మైనింగ్‌పై సీబీఐ ఎంక్వరి జరగాలన్నారు. ఏపీలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.

ఇంతకుముందు కూడా.. వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ అండగా ఉంచకపోవచ్చని సీఎం చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఏపీలో బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. వైసీపీకి ఇప్పటివరకు బీజేపీ అండగా ఉందనే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి భ్రమ రాజకీయాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు. అమిత్ షా చెప్పినట్టు విశాఖలో భూదందా నిజమేనని, దమ్ముంటే సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.