కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు?

కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్  కుమార్, సుఖ్బీర్ సంధు?

వచ్చే  లోక్సభ ఎన్నికలకు ముందుకు బ్యూరోక్రాట్లు జ్ఞానేష్  కుమార్, సుఖ్బీర్ సంధులను ఎన్నికల కమిషనర్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎన్ని కల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్ బోర్డు గురువారం ( మార్చి 14) ఉదయం సమావేశం అయింది. ఇందులో సభ్యులుగా ఉన్న లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి జ్ఞానేష్  కుమార్, సుఖ్బీర్ సంధులను ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఆరు పేర్లలో ఉత్పల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ త్రిపాఠి, జ్ఞానేష్  కుమార్, ఇండెవర్ పాండే, సుఖ్బీర్ సంధు, సుధీర్ కుమార్ గంగాధర్ రహతేలు ఉన్నారు. ఆరుగురిలో జ్ఞానేష్  కుమార్, సుఖ్బీర్ సంధుల పేర్లను ఎన్నికల కమిషనర్లుగా నియమించేందుకు ఖరారు చేసినట్లు చౌదరి తెలిపారు. 

ఎన్నికల్ కమిషనర్ అరున్ గోయల్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. గత నెలలో అనూప్ చంద్ర పాండే ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమన చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న  క్రమంలో పూర్తిస్థాయి లో ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం కీలకం. ఎన్నికల సంఘం మార్చి 15 లేదా 16న లోక్ సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్న క్రమంలో ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.