హెచ్3ఎన్2 వైరస్ కలకలం : పుదుచ్చేరిలో స్కూల్స్ లాక్ డౌన్

హెచ్3ఎన్2 వైరస్ కలకలం : పుదుచ్చేరిలో స్కూల్స్ లాక్ డౌన్

హెచ్3ఎన్2 వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలతో మహారాష్ట్రలో ఓ మెడికల్ స్టూడెంట్ చనిపోవటంతో.. అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా పుదుచ్చేరి ప్రభుత్వం అన్నింటి కంటే ముందుగా.. తీవ్రంగా స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని.. వ్యాప్తి అధికంగా ఉందని.. కట్టడి చేయటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు అక్కడి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నమశ్సివాయం ఆదేశాలు జారీ చేశారు.

హెచ్3ఎన్2 వైరస్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. రాష్ట్రంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుందని.. పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని.. వైరస్ కట్టడిని అరికట్టటానికి అన్ని స్కూల్స్ ను మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరిలో ఇప్పటికే అధికారికంగా 90 కేసులు నమోదయ్యాయి.. పరీక్షలు చేయించుకోకుండా వైరస్ లక్షణాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారని భావిస్తుంది ప్రభుత్వం. ఈ వైరస్ ప్రమాదకరం కాదని చెబుతున్నా.. క్రమంగా దేశంలో పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. 

ఇక పుదుచ్చేరిలో స్కూల్స్ లాక్ డౌన్ చేయటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వైరస్ తీవ్రత అధికంగా ఉందని.. లేకపోతే ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగతా ప్రభుత్వాలు సైతం స్పందించాలని.. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. రాబోయే రోజుల్లో హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లు.. పుదుచ్చేరి తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తుంది.