
ఆశిష్ గాంధీ హీరోగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో గాజుల వీరేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘హద్దు లేదురా’. అశోక్ మరో లీడ్‌గా నటిస్తున్నాడు. వర్ష, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్స్. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ క్రిష్ లాంచ్ చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆశిష్ గాంధీ మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా ఇది.
ఈ జనరేషన్‌కు, యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని చెప్పాడు. రాజశేఖర్ రావి మాట్లాడుతూ ‘అలనాటి కృష్ణార్జునులు ఇప్పుడు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ ,కథనం హైలైట్‌గా నిలుస్తాయి. ఫైట్స్, పాటలు సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని అన్నాడు. జనవరి చివరి వారంలో సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత వీరేశ్ చెప్పారు.