
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్, హోం అప్లియెన్సెస్ కంపెనీ హాయర్ భారతదేశ మార్కెట్‌కు ‘సీ11’ ఓఎల్ఈడీ టీవీని పరిచయం చేసింది. ఇందులో డాల్బీ విజన్ ఐక్యూ, 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 వాట్ల హర్మాన్ కార్డాన్ స్పీకర్ల వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇది 65, 55 ఇంచుల్లో లభిస్తుంది. హాయర్ సీ11 ఓఎల్ఈడీ టీవీ ప్రారంభ ధర రూ.1.67 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ స్మార్ట్‌టీవీ గూగుల్ టీవీ ఓఎస్‌తో నడుస్తుంది.