ప్రపంచంలో అత్యంత మురికి మనిషి కన్నుమూత

ప్రపంచంలో అత్యంత మురికి మనిషి కన్నుమూత

అర్ధ శతాబ్దానికి పైగా స్నానం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి గా ప్రసిద్ధి చెందిన అమౌ హాజీ తుదిశ్వాస విడిచారు. 94 ఏండ్ల వయసులో ఆయన నీటికి భయపడి మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. అమౌ హాజీ 60 ఏండ్లుగా స్నానం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొందరు గ్రామస్థుల ప్రోద్బలంతో ఒకే ఒక్కసారి స్నానం చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై చనిపోయారు. 

మొదట్లో అమౌ హాజీ ఒక బంకర్ లో నిద్రించేవాడు. కానీ గ్రామస్థులు అతనికి మట్టి గుడిసెను నిర్మించారు. అమౌ హాజీ తాజా ఆహారాన్ని తినకుండా.. కుళ్ళిన పందికొక్కులు, జంతువుల విసర్జనాలను తింటూ బతికేవాడు. అతని వల్ల  తాము అనారోగ్యానికి గురవుతామని భయపడి గ్రామస్థులంతా కలిసి స్నానం చేయించారు. అదే అతడి ప్రాణాలు తీసింది. యవ్వనంలో అతడు ఎదుర్కొన్న కొన్ని మానసిక ఒడిదుడుకుల వల్లే.. ఇలా స్నానం చేయకుండా మిగిలాడని పలువురు అంటున్నారు. హాస్యాస్పదంగా హాజీపై 2013లో ‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ’ అనే డాక్యుమెంటరీ తీశారు. దాని ద్వారానే అతడు ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా గుర్తింపు పొందాడు.

అమౌ హాజీ కి పొగతాడటం అంటే చాలా ఇష్టం. ఒకవేళ సిగరెట్‌ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకొని తాగేవాడు. ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడని అంటారు. ఏదయితేనేం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా హాజీ రికార్డులకెక్కాడు.