57శాతం భారతీయులకు భయం..ఉద్యోగం ఉంటుందో పోతుందో

57శాతం భారతీయులకు భయం..ఉద్యోగం ఉంటుందో పోతుందో

కరోనా ప్రతీ ఒక్కరిని చిన్నాభిన్నం చేసింది. ఉద్యోగం లేదు. బిజినెస్ లేదు ఇలా ప్రతీఒక్కరిని. లాక్ డౌన్ వరకే దీని ప్రభావం ఉంటుందని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ అన్ లాక్ తరువాత కరోనా ప్రభావం విపరీతంగా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పై ఉద్యోగులు ఏమంటున్నారో తెలుసుకునేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 27 దేశాల్లో ఆన్ లైన్ ద్వారా సర్వే నిర్వహించింది.  జాబ్స్ రీసెట్ సమ్మిట్  పేరుతో నిర్వహించిన సర్వేలో భారతీయుల్ని కరోనా భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.  మన దేశంలో 57 శాతంతో సహా, రాబోయే 12 నెలల్లో ప్రపంచంలోని సగం మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. అదే సమయంలో సంస్థలు సైతం కొత్త ఉపాధి అవకాశాల్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా . రష్యా , జర్మనీలో ప్రతీ నలుగురిలో ఒకరికి ఉద్యోగం భయం ఉండగా మనదేశంలో మొత్తం 57 శాతం మంది తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారని ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం తెలిపింది.