బంగారు నగలకు ‘హాల్‌మార్కింగ్‌’ తప్పనిసరి

బంగారు నగలకు ‘హాల్‌మార్కింగ్‌’ తప్పనిసరి
  • నాసిరకం నగలకు చెక్ పెట్టేందుకే కొత్త నిర్ణయం
  • ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చిన కొత్త విధానం 

న్యూఢిల్లీ: బంగారు నగలకు ఇక నుంచి హాల్ మార్కింగ్ తప్పనిసరి. బంగారంలో కల్తీ చేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త నిర్ణయం అమలులోకి వచ్చింది. పలువురు బంగారు వ్యాపారులు ఆకర్షణీయ మైన పేర్లు, స్కీములతో నకిలీ బంగారం.. కల్తీ బంగారు నగలను కట్టబెడుతున్నారనే ఆరోపణలు బహిరంగ రహస్యమే. సామాన్యులు కనిపెట్టలేని రీతిలో బంగారు నగలను కల్తీ చేస్తుండడంతో ఏది అసలో.. ఏది నకిలీయో వినియోగదారులు గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం ఇవాళ్టి నుంచి అమలులోకి తీసుకువచ్చింది. 
నిజానికి ఈ నిర్ణయం ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉంది. కరోనా కారణంగా తాము ఇంకా సన్నద్ధం కావాలేకపోయామని వ్యాపారస్తులు అభ్యంతరం చెప్పడంతో గడువును ఈనెల 1 వరకు పొడిగించారు. అయితే మళ్లీ కరోనా ఉధృతి లాక్డౌన్ అమలు చేయడంతో ఈ నిర్ణయాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలని నగల వ్యాపారుల సంఘాలు మళ్లీ ప్రభుత్వాన్ని కోరాయి. అయితే కేంద్రం ససేమిరా అంటూ కేవలం 15 రోజలు మాత్రమే గడువు పొడిగించింది. గడువు నిన్నటితో ముగిసిన నేపధ్యంలో ఇవాళ్టి నుంచి అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ్టి నుంచి 14, 18, 22 క్యారెట్ల మూడు కేటగిరీల నగలను ‘హాల్‌మార్క్‌’ గుర్తు ఉన్నవి  మాత్రమే వ్యాపారస్తులు అమ్మాల్సి ఉంటుంది. ప్రజలు బంగారు నగలు కొనేటప్పుడు హాల్ మార్కు గుర్తు ఉందో లేదో చెక్ చేసుకుని కొనాల్సి ఉంటుంది.