హనుమకొండ జిల్లా అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు పాలకుర్తి ఇరిగేషన్ డీఈ. బిల్లుల జారీ కోసం లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ జిల్లా పాలకుర్తి డిఈ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ (మే25) సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ భవానీనర్ లో ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్లులకోసం పెద్దవంగర మండలం కన్నాయిగూడెంకు చెందిన కాంట్రాక్టర్ కర్ర అశోక్ రెడ్డి ఫిర్యాదు మేరకు రూ.50వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీకి సమాచారం ఇచ్చారు బాధితులు. రంగంలోకి దిగి ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
