
టౌన్/రాజన్నసిరిసిల్ల/ సుల్తానాబాద్/కోరుట్ల/ రాయికల్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా చేనేత దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో కొండలక్ష్మణ్ బాపూజీ ఫొటోకు కలెక్టర్ పమేలాసత్పతి ఆధ్వర్యంలో పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గదని, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని వెల్లడించారు.
అనంతరం జిల్లా నుంచి చేనేత పురస్కారాలు అందుకున్న పలువురు నేత కార్మికులను సన్మానించారు. చేనేత వస్త్రాల ప్రదర్శనను సందర్శించి, నేత వస్త్రాలను పరిశీలించారు. అనంతరం అక్టోబర్ 12న కరీంనగర్ లో నిర్వహించనున్న కరీంనగర్ హాఫ్ మారథాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, కేకే మహేందర్‌రెడ్డి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, వస్త్ర పరిశ్రమ యజమానులు, నేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. రాయికల్‌లో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కోరుట్లలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. సుల్తానాబాద్‌లో చేనేత కార్మికులను సన్మానించారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, లీడర్లు అయిల రమేశ్, మహేందర్, మురళి, రవి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.