టీచర్లకు చేనేత చీరలు

టీచర్లకు చేనేత చీరలు
  • హైదరాబాద్​లో అందజేసిన మంత్రులు కేటీఆర్, సత్యవతి 
  • ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జూట్, చేనేత బ్యాగుల విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు సిబ్బందికి చేనేత చీరలను అందిస్తున్నామని మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. 31,711 మెయిన్, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు చేనేత చీరలు ఇస్తున్నట్లు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్ క్యాంప్ ఆఫీస్​లో పలువురు అంగన్వాడీలకు చేనేత చీరలను అందించారు. తర్వాత ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత, జూట్ బ్యాగులను రిలీజ్ చేశారు. టీచర్లు, ఆయాలకు ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించామని, ఇప్పుడు మూడో జతగా చేనేత చీరలు అందించామని చెప్పారు. అంగన్వాడీలకు గౌరవప్రదమైన వస్త్రాలు.. సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పటిష్ఠం చేస్తున్నామని అన్నారు. ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్​ను, పోషకాహారాన్ని అందిస్తున్నామని మంత్రులు తెలిపారు.