
- 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ పై ప్రజాభిప్రాయ సేకరణ
- జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్
హైదరాబాద్: 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే అంశంపై 15 రోజుల్లో కేంద్రానికి సిఫారసు చేస్తామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారా అహిర్, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య , ఎంపీలు కె. లక్ష్మణ్, బీబీ పాటిల్, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ మాట్లాడుతూ ఫైనల్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాం. కొన్ని కులాల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వాటిని మినహాయించి మిగతా కులాలను జాబితాలో చేర్చేందుకు కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 15 రోజుల్లో కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం కాగానే మిగతా కులాలను కూడా ఓబీసీ జాబితాల్లో చేర్చాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నదే.. తెలంగాణ రాష్ట్రప్రభుతవం తొలగించిన 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చాలని కె. లక్ష్మణ్ డి మాండ్ చేశారు.