బీహార్ మంత్రిపై దాడి..కిలోమీటర్ వరకు కాన్వాయ్ ని వెంబడించిన స్థానికులు

బీహార్ మంత్రిపై దాడి..కిలోమీటర్ వరకు కాన్వాయ్ ని వెంబడించిన స్థానికులు
  • రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి
  • స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరామర్శకు వెళ్లిన మినిష్టర్
  • ఆలస్యంగా రావడంపై గ్రామస్థుల ఆగ్రహం
  • కిలోమీటర్ మేర కాన్వాయ్ని వెంబడించిన ప్రజలు

పాట్నా: బీహార్ లో అక్కడి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై గ్రామస్థులు దాడి చేశారు. ఆయన కాన్వాయ్ ని కిలోమీటర్ దూరం వరకు వెంబడించారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు.

►ALSO READ | ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లోనే ఇంజన్ ఫెయిల్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఘటన జరిగిన చాలా రోజులు అయిన తర్వాత పరామర్శకు వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు దాడికి దిగారు. అయితే ఆ దాడిలో మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆయన బాడీగార్డ్ గాయపడ్డారు. 

స్థానికుల ఆగ్రహంతో మంత్రి కాన్వాయ్ గ్రామం నుంచి వెను దిరిగినప్పటికీ కిలోమీటర్ దూరం వరసు కాన్వాయ్ లోని వాహనాలను గ్రామస్థులు వెంబడించారు. దీంతో ఆ గ్రామంలో భద్రతను పెంచారు.