ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లోనే ఇంజన్ ఫెయిల్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లోనే ఇంజన్ ఫెయిల్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్..

అహ్మదాబాద్ ఘటన మరవకముందే, విమాన ప్రయాణాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తన్నాయి. ఈ తరుణంలోనే 150 మందితో సూరత్ నుండి దుబాయ్ వెళ్తున్న ఓ ఇండిగో విమానం, మంగళవారం అకస్మాత్తుగా ఇంజిన్ లోపం కారణంగా  అహ్మదాబాద్‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ చాకచక్యంగ వెంటనే నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇవాళ ఉదయం బయలుదేరిన ఇండిగో విమానం 6E-1507కు గాల్లోనే సాంకేతిక లోపం ఏర్పడింది. దింతో విమానం గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్లో సమస్య తలెత్తిందని, అందుకే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్‌లైన్స్ అధికారులు తేలిపారు.

విమానంలో ప్రయాణికుల భయాందోళన, సేఫ్  ల్యాండింగ్ : సాంకేతిక లోపం గురించి ప్రయాణీకులకి తెలియగానే క్యాబిన్ అంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. కొంతమంది ప్రయాణీకులు ప్రార్థనలు చేస్తూ కనిపించగా, మరికొందరు ఎమర్జెన్సీ ల్యాండింగ్  గురించి సమాచారాన్ని వెంటనే బంధువులకు ఫోన్ చేసి తెలియజేశారు. 

చివరికి అత్యవసర ల్యాండింగ్ సజావుగా జరిగిందని, ప్రయాణీకులందరూ సురక్షితంగా దిగారని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా, ప్రయాణికులకు  ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 

ALSO READ : బర్త్ డే సెలబ్రేషన్స్ టైంలోనే కుప్పకూలిన బిల్డింగ్

అత్యవసర ల్యాండింగ్ తరువాత ఇండిగో ఇంజనీరింగ్ బృందం ఇంజిన్ సమస్యను గుర్తించడానికి వెంటనే తనికీలు నిర్వహించింది.  అయితే విమాన సంస్థ ప్రయాణీకులు దుబాయ్‌ వెళ్ళడానికి మరో విమానాన్ని వెంటనే ఏర్పాటు చేసి పంపింది. 

ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి తెలియజేయగ, పూర్తి దర్యాప్తు తరువాత ఈ సమస్య మెకానికల్  వైఫల్యమా లేదా సాంకేతిక లోపమా అనేది తేల్చనుంది.