
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ను వరద కలిపింది. వీళ్లి ద్దరూ అనూహ్యంగా వరద ప్రాంతాల పర్యటన లో కలుసుకున్నారు. గురువారం (ఆగస్టు 28) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా కలవడంతో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
సిరిసిల్లలో పరద బాధిత ప్రాంతాలలో బండి సంజయ్ పర్యటించి వెలు తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నా రు. యాదృచ్చికంగా ఎదురెదురు పడటంతో మర్యాద పూర్వకంగా కలుసుకుని పరస్పరం అభివాదం కరచాలనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఈ ఆకస్మిక పరిణామాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతూ బండి, కేటీఆర్ ల నాయకత్వం వర్ధిల్లాలంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు.
►ALSO READ | మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలె: మాజీ మంత్రి కేటీఆర్