
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- వరద ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి
రాజన్న సిరిసిల్ల: వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం చెల్లిం చాలని అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వరదలు ముంచెత్తుతుంటే.. మూసీ సుందరీకరణ, ఒలిం పిక్స్ క్రీడల గురించి సీఎం సమీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పని చేయకపోయి నా అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని కొనియాడారు.