సొంత ఇంటినే ప్రియురాలికి అద్దెకిచ్చిన బాలీవుడ్ హీరో.. మరి ఇంత చీప్ గానా!

సొంత ఇంటినే ప్రియురాలికి అద్దెకిచ్చిన బాలీవుడ్ హీరో..  మరి ఇంత చీప్ గానా!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.  అంధేరి వెస్ట్ లో విశాలమైన తన  సొంతింటిని  ఏకంగా తన ప్రియురాలు సబా ఆజాద్‌కు అద్దెకిచ్చారు.  గర్ల్ ఫ్రెండ్ తో చేసుకున్న ఈ అద్దె ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  ఎందుకంటే అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో అద్దె ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ తన ప్రియురాలికి అత్యంత తక్కువ ధరకే అద్దెకు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ప్రియురాలి కోసం తక్కువ అద్దెకు.. 
జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లోని మన్నత్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న హృతిక్ ఫ్లాట్‌కు నెలవారీ అద్దె కేవలం రూ. 75,000 మాత్రమే. ఈ ప్రాంతంలో సాధారణంగా ఇలాంటి 3-బెడ్‌రూమ్ ఫ్లాట్‌లకు అద్దె రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. అయితే అద్దె ఒప్పందంలో భాగంగా సబా ఆజాద్ రూ.1.25 లక్షల డిపాజిట్‌ను చెల్లించారు.  నిజానికి హృతిక్ ఈ భవనంలో రూ. 97.5 కోట్లతో రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అందులో ఒకటి 19, 20 అంతస్తుల్లో ఉన్న డ్యూప్లెక్స్ కాగా, మరొకటి సబా ఇప్పుడు నివసించనున్న 18వ అంతస్తులోని 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్. ఈ ఫ్లాట్‌కు సముద్రపు వ్యూలో ఉంటుంది. 

అద్దె ఇంట్లో హృతిక్
 ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరూ గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కానీ వీరిద్దరూ ఎప్పుడూ కలిసి జీవించడం లేదు. హృతిక్ గతంలో చాలాసార్లు తన నివాసాన్ని మార్చారు. సుస్సానే ఖాన్‌తో విడిపోయిన తర్వాత, 2014లో అతను తన అపార్ట్‌మెంట్‌ను మార్చారు. జుహులోని పలాజో భవనంలో ఉంటున్న హృతిక్, అక్కడి నుంచే తన తల్లిదండ్రులు రాకేష్, పింకీ రోషన్‌లతో పాటు సోదరి సునైనాను తరచుగా కలుస్తూ ఉంటారు. అయితే, కుటుంబం ఎక్కువ సమయం లోనావాలాలోని విల్లాలో గడుపుతుంది. 

►ALSO READ | Singha : రియల్ సింహంతో 'సింఘా'.. సినీ చరిత్రలో తొలి సారిగా భారీ ప్రయోగం!

ఇక హృతిక్ సినిమాల విషయానికొస్తే .. ఇటీవల ఆయన నటించి ‘వార్ 2’ మూవీ ఆగస్టు 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది.  ప్రస్తుతం ‘క్రిష్ 4’ కోసం పనిచేస్తున్నారు, ఇందులో హృతిక్ హీరోగా, దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, సబా తదుపరి చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్', కాశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ పీరియడ్ డ్రామా ఆగస్టు 29న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.