ఈ 10 జిల్లాలకు బిగ్ అలర్ట్: రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు.. బయటకు వెళ్లకండి

ఈ 10 జిల్లాలకు బిగ్ అలర్ట్: రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు.. బయటకు వెళ్లకండి

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (ఆగస్ట్ 27) మెదక్, కామారెడ్డి జిల్లాలను వర్షం ముంచెత్తింది. గురువారం (ఆగస్ట్ 28) కూడా పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల,  సిద్దిపేట.. ఈ 10 జిల్లాల్లో గురువారం (ఆగస్ట్ 28) ఉదయం 7:00 నుంచి 10 గంటల వరకు మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. 

దాదాపు పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 

Also Read : పొంగి పొర్లుతున్న ఊర చెరువు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్..

ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. గంటకు 40 కి.మీ గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ముంపు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇండ్ల నుంచి వెళ్లొద్దని .. అత్యవరసమైతేనే బయటకు రావాలని సూచించారు.