సైబర్ పంజాలో ఆలయ ఉద్యోగి.. క్రెడిట్ కార్డుల నుంచి రూ.9.60 లక్షలు స్వాహా

సైబర్ పంజాలో ఆలయ ఉద్యోగి.. క్రెడిట్ కార్డుల నుంచి రూ.9.60 లక్షలు స్వాహా

సైబర్ నేరస్తులు క్రెడిట్ కార్డులను టార్గెట్ చేస్తున్నారు. ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని.. ఎంతో కొంత డబ్బులు పంపించి.. ఓటీపీ చెప్పాలని.. ఇలా ఏదో ఒకరకంగా ట్రాప్ చేసి లక్షల్లో స్వాహా చేస్తున్నారు. లేటెస్ట్ గా మహబూబాబాద్ జిల్లాలోని కురవికి చెందిన ఆలయ ఉద్యోగిని ట్రాప్ చేశారు. సైబర్ నేరస్తుల వలలో పడి రూ.9.60 లక్షలు పోగొట్టుకున్నాడు. 

కురవి వీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జగన్నాథానికి సైబర్ నేరస్తలు ఫోన్ చేసి తాము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి అతడి క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకున్నారు. 

►ALSO READ | ఏం ట్యాలెంట్ సామీ.. క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలింపు.. వైజాగ్లో పట్టుకున్న పోలీసులు

అతడికి సంబంధించిన నాలుగు క్రెడిట్ కార్డుల నుంచి దశల వారీగా 9.60 లక్షలు డ్రా చేసుకున్నారు. బాధితుడి ఫోన్కు వచ్చిన మొసేజ్ చూసుకున్న అతను తాను మోస పోయినట్లు గుర్తించి ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.