
హైదరాబాద్ టూ అదిలాబాద్.. అదే విధంగా అదిలాబాద్ టూ హైదరాబాద్.. జాతీయ రహదారి 44.. దీన్ని నాగపూర్ హైవే అంటారు.. గూగుల్ మ్యాప్ కూడా ఈ రహదారినే చూపిస్తుంది.. ఇప్పుడు ఈ రూటు మారింది. భారీ వర్షాలతో కామారెడ్డి దగ్గర రోడ్లు కొట్టుకుపోవటంతో.. ఇప్పటికే 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జాం అయ్యింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్.. అత్యంత కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ టూ అదిలాబాద్ తోపాటు అదిలాబాద్ టూ హైదరాబాద్ రూటును మార్చింది. ఈ వివరాలు మీ కోసం..
Also read:-భారీ వర్షాలతో రైళ్ల రద్దు.. ఈ రూట్లలో వెళ్లేవారికి అలర్ట్.. రద్దైన రైళ్లు ఇవే..
హైదరాబాద్ టూ అదిలాబాద్ మారిన రూటు ఇది :
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారి 44 నాగపూర్ హైవేపై వెళ్లే భారీ వాహనాలను హైదరాబాద్ సిటీ శివార్లలోనే ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. మేడ్చల్ చెక్‌పోస్ట్ దగ్గర భారీ వాహనాలను కరీంనగర్ హైవే వైపు మళ్లిస్తున్నారు. మళ్లిస్తారు.
మేడ్చల్ చెక్‌పోస్ట్ → సిద్దిపేట → కరీంనగర్ → జగిత్యాల → కోరుట్ల → మెట్‌పల్లి → ఆర్మూర్ మీరుగా ఆదిలాబాద్ చేసుకుకోవాలి. మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మళ్లించేది భారీ వాహనాలు. అంటే లారీలు, కంటైనర్లు వంటి భారీ వెహికల్స్.
కారు, జీపులు వంటి లైట్ మోటార్ వాహనాల దారి మళ్లింపు ఇలా ఉంది :
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారి -44 (నాగ్‌పూర్ హైవే) ద్వారా వెళ్తున్న తేలికపాటి వాహనాలను తూప్రాన్ దగ్గర దారి మళ్లిస్తున్నారు. కరీంనగర్ హైవేకు కనెక్ట్ చేస్తున్నారు.
మేడ్చల్→ తూప్రాన్ → సిద్దిపేట → కరీంనగర్ → జగిత్యాల → కోరుట్లా → మెట్‌పల్లి → ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ చేరుకోవాలి.
కామారెడ్డి – డిచ్‌పల్లి – ఆర్మూర్ మధ్య జాతీయ రహదారి 44 రోడ్డు కోతకు గురైంది. రోడ్డు కొట్టుపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి అదిలాబాద్ లేదా నాగపూర్ జాతీయ రహదారిపై వెళ్లాలనుకునే వాహనదారులు అందరూ కూడా హైదరాబాద్ లో బయలుదేరే ముందే ఈ డైవర్షన్ విషయాన్ని గుర్తించాలి. కాదు కూడదు అని గూగుల్ మ్యాప్ చూసుకుని వెళితే మాత్రం బుక్ అయిపోతారు. ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు. ఇప్పటికే ఆయా డైవర్షన్ పాయింట్ల దగ్గర ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించి.. ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్లు తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవాలి. నాగపూర్, అదిలాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలి.
అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రూటు కూడా మారింది :
భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావటంతో ఆదిలాబాద్ నుంచి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే రూటు కూడా మారింది. నిర్మల్ దగ్గర ఉన్న కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమ వైపునకు తిరిగి డైవర్షన్ మార్చుకుని కొండాపూర్ నుంచి వయా మామడ, ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటించారు.