
తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో దంచి కొట్టిన వర్షాలకు పలు జిల్లాలకు వరదలు పోటెత్తాయి. కొన్ని చోట్ల ఊర్లకు ఊర్లే జలమయం అయ్యాయి. వర్షాల వరదల భీభత్సకి రోడ్లతో సహా రైలు మార్గాలు కూడా కొట్టుకుపోయాయి. అయితే ప్రయాణికుల భద్రత, ముందు జాగ్రత్తల పై దృష్టి పెట్టి భారతీయ రైల్వే శాఖ కొన్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు రద్దు చేయగా, మరికొన్ని చోట్ల తాత్కాలికంగా నిలిపివేసింది.
Also read:-హైదరాబాద్ టూ ఆదిలాబాద్ రూటు మారింది : రెగ్యులర్ హైవే ఎక్కితే ఇరుక్కుపోతారు..
తాత్కాలికంగా రద్దు చేసిన ట్రైన్ల వివరాలు:
17003 - కాజీపేట్ నుండి సిర్పూర్ టౌన్
17004, 17035, 17036 - బల్లార్షా నుండి కాజీపేట్
77631, 77632, 77633, 77634, 77635, 77636, 77637, 77638 - బీదర్ నుండి కాలాబుర్గి
17035, 17036- కాజీపేట నుండి బల్లార్ష
67771, 67772 సిర్పూర్ టౌన్ నుండి కరీంనగర్
67773, 67774 కరీంనగర్ నుండి బోధన్
ఈ మార్గంలో రద్దు చేసిన ట్రైన్ల వివరాలు :
17033 - భద్రాచలం నుంచి బల్లార్షా వెళ్లాల్సిన ట్రైన్ ను కాజీపేట నుండి బల్లార్ష మధ్య తాత్కాలికంగా రద్దు చేసారు.
17034 సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్లాల్సిన ట్రైన్ ను సిర్పూర్ టౌన్ నుండి కాజిపేట్ వరకు తాత్కాలికంగా రద్దు చేసారు.
17234, 17233- సికింద్రాబాద్ సిర్పూర్ కాజాజ్ నగర్ మధ్య ప్రయాణించాల్సిన ట్రైన్ ను కాజిపేట్ నుండి సిర్పూర్ కాజాజ్ నగర్ మధ్య రద్దు చేసారు.