
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఏరియాలో కుండపోత వర్షాలు.. నాలుగు అంటేు 4 గంటల్లోనే 40 సెంటిమీటర్ల వర్ష బీభత్సం.. దీనికి కారణం చక్రవాక ఆవర్తనం అంట.. అవును.. క్లౌడ్ బరస్ట్ విన్నాం.. క్యుములో నింబస్ మేఘాలు విన్నాం.. ఈ చక్రవాక ఆవర్తనం ఏంటీ అనే డౌట్ అందరికీ వస్తుంది. నిన్నటికి నిన్న వినాయక చవితి రోజు తెలంగాణ రాష్ట్రంపై ఆకాశంలో విస్తరించిన చక్రవాక ఆవర్తనం వల్లే ఈ కుండపోత వర్షాలు అని వాతావరణ శాఖ ప్రకటించింది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డి మండలం, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో పడిన కుండపోత వానలకు ఈ చక్రవాక ఆవర్తనం అంటున్నారు అధికారులు. ఇంతకీ ఈ చక్రవాక ఆవర్తనం ఏంటో తెలుసుకుందాం..
చక్రవాక ఆవర్తనం అంటే ఏంటీ :
సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం సహజం. ఈసారి మాత్రం ఉపరితల ఆవర్తనం కేంద్రం చుట్టూ చక్రవాక ఆవర్తనం ఏర్పడింది. అంటే ఉపరితల ఆవర్తనం కేంద్రం ఉంటుంది కదా.. వాతావరణ భాషలో కన్ను అంటారు దీన్ని. దీని చుట్టూ గాలి తిరగటం అన్నమాట. గాలి రౌండ్ గా.. వృత్తం ఆకారంలో తిరగటం.. దీన్ని చక్రవాక ఆవర్తనం అంటారు. ఈ చక్రవాక ఆవర్తనం వల్ల గాలి తిరిగే ఈ ప్రాంతం మొత్తంలో అతి భారీ వర్షాలు పడతాయి. ఆ ప్రాంతం వరకే కుండపోత వానలు పడే అవకాశం ఉంటుంది. కామారెడ్డిలో జరిగింది ఇదే అంటున్నారు. చక్రవాక ఆవర్తనం ఏర్పడి.. కుంభవృష్టిగా వానలు పడ్డాయి. వాతావరణ శాఖ భాషలో చెప్పాలంటే చక్రవాక ఆవర్తనం.. వాతావరణంలో మార్పులను సూచించే ఓ పద్దతి.
Also read:-కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్
అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలులు.. చక్రవాక ఆవర్తనంగా ఏర్పడి కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల పరిధిలో విస్తరించాయి. ఈ క్రమంలోనే ఆ జిల్లాల్లో అత్యంత భారీగా ప్రభావం చూపించాయి ఈ గాలులు. వర్షాలు. ఈ మూడు జిల్లాల్లో 48 గంటల్లోనే 60 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. ఆగస్ట్ 28వ తేదీ కూడా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో 10 నుంచి 20 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
ఇక కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒక్క గంటలో 15 నుంచి 20 సెంటిమీటర్ల వర్షం పడితేనే క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారని.. అలాంటి అవకాశం లేదని వెల్లడించారు అధికారులు. ఆగస్ట్ 27వ తేదీ బుధవారం కామారెడ్డి జిల్లాలో 24 నుంచి 48 గంటల్లో 60 సెంటిమీటర్ల వర్షం నమోదైందని.. ఆ స్థాయిలో క్లౌడ్ బరస్ట్ అయ్యే సూచనలు లేవని వివరించిన వాతావరణ శాఖ.. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అవుతాయని వివరించింది.