
హైదరాబాద్: జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వచ్చే రెండు మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 62-87 వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
హనుమకొండ, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు హైదరాబాద్ వాతారణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.