
TVS Orbiter e-scooter: దేశంలోని ప్రజలు ఇప్పుడిప్పుడే ఈవీల వైపుకు మళ్లుతున్నారు. ప్రధానంగా ఇంధన ఛార్జీల భారాన్ని తగ్గించుకునేందుకు మధ్యతరగతి భారతీయులు కూడా మార్కెట్లోని ఈవీ స్కూటర్ల కొనుగోలుకు వెళ్లటం అమ్మకాలను పెంచుతోంది. ఈ కారణంగా అనేక సంస్థలు కొనుగోలుదారుల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా నయా మోడల్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
ఈ క్రమంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీదారుల్లో ఒకటైన టీవీఎస్ సంస్థ Orbiter పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవాళ (ఆగస్టు 28న) భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 99వేల900గా ఉంది. స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ తో 158 కిలోమీటర్ల IDC నిర్ధారిత రేంజ్ కలిగి ఉంది. ఈ కేటగిరీలో అత్యంత ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తున్న స్కూటర్ మోడల్ ఇదే కావటం గమనార్హం. TVS Orbiter 3.1 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. దీనిలో క్రూయిస్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు, రివర్స్ మోడ్, ఆటోమేటిక్ హిల్-హోల్డ్, ఫాల్-ట్రిగర్డ్ మోటార్ కట్ ఆఫ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.
ALSO READ : ఇండియా క్లీన్ఎనర్జీ హబ్..
టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయటానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. దీనికి ప్రత్యేకంగా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం లేదని తెలుస్తోంది. ఇక బండికి అందించిన 14 అంగుళాల చక్రాలు స్థిరత్వాన్ని ఇవ్వటంతో పాటు హ్యాండ్లింగ్ మెరుగుపరుస్తాయని కంపెనీ చెబుతోంది. అలాగే సీటు కింద 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉండటంతో సులువుగా రెండు హెల్మెంట్లను ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే ప్రయాణ సంయంలో టాప్ స్పీడ్ గంటకు 82 కిలోమీటర్లుగా ఉంది.
అలాగే స్కూటర్ డిజిటల్ క్లస్టర్ ద్వారా TVS SmartXonnect యాప్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. దీనివల్ల జియో-ఫెన్సింగ్, కాల్ అలర్ట్స్, సేఫ్టీ అలర్ట్స్, నావిగేషన్ వంటి ఫీచర్లను వినియోగదారులు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇక బండికి ముందు డిస్క్ బ్రేక్ అలాగే వెనుక వీల్ కి డ్రమ్ బ్రేక్ అందిస్తోంది టీవీఎస్. ప్రస్తుతం ఈ స్కూటరును కంపెనీ మెుత్తం ఆరు రంగుల్లో అందుబాటులోకి తెస్తోంది. నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్టిన్ కాపర్ అనే కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తోంది టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.
సిటీ కమ్యూటింగ్ చేసేవారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక బెస్ట్ ఛాయిస్ గా ఉండనుంది. ఇక చివరిగా.. కేవలం కిలోమీటరు ప్రయాణానికి 20 పైసలు మాత్రమే ఖర్చవుతుండటం మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు బెస్ట్ ఎంపికగా నిలవటానికి కారణంగా మారుతుందని టీవీఎస్ భావిస్తోంది.