
హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఆర్గాన్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో శ్రీనివాస్ ఓంకార్ రూపొందిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాత. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మరో పాటను విడుదల చేశారు. ‘అనుకున్నదే అవ్వక.. కల నీదే తీరక.. బలమైన కోరిక.. నీ గమ్యం చేరక..’ అంటూ సాగిన పాటలో హన్సిక మాసివ్ లుక్‌లో కనిపిస్తోంది.
మార్క్ కె రాబిన్ కంపోజ్ చేసిన ఈ పాటకు ‘పోరాటం పోరాటం ఆపొద్దు ఇంకా నీ పోరాటం. బరిలో దూకే తెగింపు చూపే నువ్వు గెలవాలి ఇవాళే’ అంటూ ఇన్‌స్పైరింగ్‌గా లిరిక్స్ రాశాడు కృష్ణకాంత్. రాహుల్ సిప్లిగంజ్ పాడిన విధానం ఆకట్టుకుంది. మురళీశర్మ, ‘ఆడుకాలం’ నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.