
దక్షిణాది నటిని కావడం వల్ల సినీ ఇండస్ట్రీలో తానెంతో వివక్షను ఎదుర్కొన్నానని హన్సిక మోత్వాని(Hansika Motwani) తెలిపింది. బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ‘దేశముదురు(Deshamuduru)’ సినిమాతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుని సెటిలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్‌లో సౌత్ నటిని కావడం వల్ల తనను చులకనగా చూసేవారని తెలిపింది.
ఒకప్పుడు తనకు డిజైనర్లు బట్టలు కూడా ఇచ్చేవారు కాదంది. ‘ఓ మీరు సౌత్ హీరోయినా.. సారీ మేం ఇవ్వలేం’ అంటూ మొహం మీదే చెప్పేవారని తెలిపింది. కానీ ఇప్పుడు దక్షిణాది సినిమాకు వచ్చిన గుర్తింపు వల్ల పరిస్థితులు మారాయని చెప్పుకొచ్చింది. ఆరోజు అలా అన్నవారే.. మీ ఈవెంట్లకు మా బట్టలు, మేకప్ ట్రై చేయండని ఇప్పుడు వెంటపడుతున్నారని తెలిపింది.