నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ఎల్కతుర్తి(కమలాపూర్), వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను సజావుగా స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ సూచించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలైన ఎల్కతుర్తి, దామెర, గోపాల్ పూర్ పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఎలక్షన్ నోటీస్, ఓటర్ల జాబితా, హెల్ప్ డెస్క్​లను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో 210  జీపీలు, 1,986 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 74 క్లస్టర్లు ఉన్నాయని, మొదటి విడత భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోని 24 క్లస్టర్లలో ఎన్నికలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎంసీసీ నోడల్ ఆఫీసర్ ఆత్మారాం, జడ్పీ సీఈవో రవి, ఎల్కతుర్తి తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కేశవాపూర్ ను సందర్శించిన సీపీ..

ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ పంచాయతీలో నామినేషన్ కేంద్రాన్ని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ దార కవిత, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచనలిచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.