హసన్ పర్తి, వెలుగు: శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడంలో పురుషులు ముందు ఉండాలని హనుమకొండ డీఎంహెచ్ వో అప్పయ్య అన్నారు. గురువారం హసన్ పర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ఎస్ వీ ఆపరేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి హాజరైన డీఎంహెచ్ వో మాట్లాడుతూ వాసెక్టమి పక్షోత్సవాల్లో భాగంగా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 4 వరకు పురుషులకు కోత కుట్టు లేని ఎన్ ఎస్ వీ ఆపరేషన్ పై అవగాహన కలిగించడంతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిబిరంలో ఎన్ ఎస్ వీ సర్జన్ డాక్టర్ కృష్ణారావు ఆపరేషన్లు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, డాక్టర్ స్టాటిస్టికల్ అధికారి జీ. ప్రసన్నకుమార్, హెల్త్ అసిస్టెంట్స్ సంతోష్ కుమార్, ఇంద్రారెడ్డి, మోసిన్ పాల్గొన్నారు.
