HanumanMovie: సింగిల్ స్క్రీన్ల కోసం హనుమాన్ ఘోష..మరి ఇంత దారుణమా!

HanumanMovie: సింగిల్ స్క్రీన్ల కోసం హనుమాన్ ఘోష..మరి ఇంత దారుణమా!

శుక్రవారం వస్తేనే సినిమాల పండుగ వస్తోంది. అలాంటిది సంక్రాంతి లాంటి పండుగ వస్తే..ఇక సినిమాల జాతర ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే ఊహలో..పెద్ద హీరోలు..భారీ బడ్జెట్ సినిమాలు..హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్..ఇక అలాంటి జాతర లాంటి పండుగ ఊహించుకుంటేనే..నోరురెస్తోంది కదా..ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి జాతరే ఉంది. 

కానీ, టాలీవుడ్లో ప్రస్తుతం రిలీజ్ సినిమాలు ఎక్కువయ్యాయి. థియేటర్స్ తక్కువయ్యాయి.దీంతో కొన్ని సినిమాలపై ఆశలు పెట్టుకున్న ఆడియన్స్కి చేదు వార్త మిగులుతుంది. కొన్నిసార్లు అందరికీ సమన్యాయం చేయడం సాధ్యం కాకపోయినా..కనీసం ఎంతో కొంత సెట్ అయ్యేలా చూడాలనేది చిన్న సినిమా నిర్మాతల డిమాండ్. 

ఇపుడు హనుమాన్ (Hanuman) సినిమాకు థియేట‌ర్ల కేటాయింపులో అన్యాయం జ‌రుగుతోంద‌ని చిత్ర నిర్మాత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై..టాలీవుడ్ లో అందరు చర్చింకుంటున్నారు. ముఖ్యంగా  హనుమాన్ సినిమా బడ్జెట్ పరంగా, బుక్ మై షోలో ఆడియన్స్ చూపిస్తున్న ఇంట్రెస్ట్ పరంగా ఇది పెద్ద చిత్రమనే క్లారిటీ వచ్చేసింది. 

కానీ థియేటర్ల కేటాయింపు విషయంలో మాత్రం పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఇక హనుమాన్ మూవీకి కేటాయించిన థియేటర్ల విషయానికి వస్తే..హైదరాబాద్ లో కేవలం నాలుగు సింగల్ స్క్రీన్లు మాత్రమే రిలీజ్ కు (జనవరి 12న) కేటాయించడం చూస్తే ఎలాంటి చిన్న చూపు కలుగుతుందో ఆలోచించవచ్చు. చిన్న సినిమాకి దక్కిన గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నా..ఎవ్వరి గొంతు థియేటర్ల లెక్కలోకి మాత్రం వెళ్లడం లేదు. 

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సప్తగిరి, కాచిగూడ కుమార్, సికింద్రాబాద్ అంజలి, బాలానగర్ విమల్ థియేటర్లు హనుమాన్ సినిమా కోసం కేటయించారు. అసలు ఈ థియేటర్స్ కి జనాల ఆదరణ ఎలా ఉంటుందనే విషయం తెలిసిందే. మరి ఇంతలా చూడటం ఏంటీ ? అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. హనుమాన్ మూవీ మేకర్స్ మాత్రం  కనీసం ఓ పది, పదిహేను థియేటర్ల అయినా ఇవ్వాలన్న ఆశలు, అభర్ధనలు ఫలించలేదు. 

ఇక అదే రోజు రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమాకి తొంబై దాకా సింగల్ స్క్రీన్లు ఇవ్వడం ఇక్కడ ప్రధాన సమస్య అయింది.   అలాగే ఈగల్ సినిమా కోసం కేటాయించిన దేవి థియేటర్ ను నాగ్ నా సామిరంగకు ఇచ్చేశారు.ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మరో థియేటర్ సంధ్య 70 ఎంఎంలో ప్రస్తుతం సలార్ తీసేసే ఛాన్స్ ఉన్నా..మూడో వారమూ కూడా కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉండటంతో హనుమాన్ కి అడ్డురాయి వేసినట్లు అయింది. కానీ,ఇక్కడ సలార్, హనుమాన్ ఈ రెండు సినిమాలకు మైత్రి మేకర్స్ వాళ్లే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నది. ఎవ్వరు మధ్యలో లేనప్పటికీ..ప్రభాస్ సినిమా క్రాస్ రోడ్స్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డుకి దగ్గరగా ఉండటం వల్ల తీసేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. 

హనుమాన్ కి మల్టీప్లెక్సుల్లో ను అంతే సంగతి అన్నట్లు కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే కానీ ఎన్ని థియేటర్లో ఉందనే క్లారిటీ వస్తోంది. ఇక సిటీలో బడా థియేటర్స్ అయినా ప్రసాద్, ఏఎంబి, పివిఆర్ ఐనాక్స్ లాంటి వాటిల్లో..హనుమాన్, గుంటూరు కారంకి ఎన్ని షోస్ పడేలా ప్లాన్ చేశారనేది త్వరలో తెలుస్తోంది. ఇక ఏదేమైనా సినిమాకి హిట్ టాక్ వస్తే కనుక..థియేట‌ర్ల సంఖ్య అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanthvarma) ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్గా ప్రశాంత్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంట్వ్యూలో మాట్లాడుతూ..'మా సినిమాపై హిందీ బ‌య్య‌ర్లు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అక్క‌డ 1200 థియేట‌ర్ల‌లో హనుమాన్ ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ తెలుగులో మాకు కేవ‌లం 50 థియేట‌ర్లే దొరుకుతున్నాయి. దీంతో మాకు చాలా నష్టం వస్తోంది. కానీ, 50 థియేట‌ర్ల కోసం ఆలోచిస్తూ..1200 థియేట‌ర్ల‌ని వ‌దులుకోలేం క‌దా' అన్నారు.  ఇక రేపు జనవరి 7న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు. ఇక మెగా మానియా ఏం మాట్లాడునున్నాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.