53 వేల టికెట్లు.. రూ.2.66 కోట్లు.. రామయ్యకు హనుమాన్ టీమ్ భారీ విరాళం

53 వేల టికెట్లు.. రూ.2.66 కోట్లు.. రామయ్యకు హనుమాన్ టీమ్ భారీ విరాళం

రామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్య(Ayodhya)లో రామాలయ(Ram Mandhir) ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. జనవరి 22న జరుగనున్న ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు దేశ ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ అపురూపమైన సమయంలో ఇటీవల విడుదలైన హనుమాన్‌ సినిమా సంచలనంగా మారింది. శ్రీరామ భక్తుడు హనుమంతుని కథతో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

ఇక ఈ సినిమా విడుదల సమయంలో హనుమాన్‌ చిత్ర నిర్మాత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలా హనుమాన్ ప్రీమియర్ షోల కోసం 2,97,162 టిక్కెట్లు విక్రయించగా వచ్చిన డబ్బుల నుండి రూ.14,85,810 చెక్కును ఇప్పటికే రామ్ మందిరానికి అందజేశారు. ఆ తర్వాత ఇవాళ్టి(జనవరి 21) వరకు 53,28,211 టిక్కెట్ల అమ్ముడవగా.. అందులో రూ.2,66,41,055 రామ్ మందిరానికి అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో హనుమాన్ మూవీ టీమ్ పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ మార్కును ఈజీగా దాటేయనుంది ఈ మూవీ. ఇప్పటికే చాలా చిత్ర బ్రేకీవెన్ సాధించిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది హనుమాన్ మూవీ.