ఫ్యామిలీస్​ మెచ్చేలా హనుమాన్

ఫ్యామిలీస్​ మెచ్చేలా హనుమాన్

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న  సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. మంగళవారం ఈ చిత్రంలోని ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో తేజ మాట్లాడుతూ ‘మనకి ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ.. ఇది  మన కల్చర్‌‌‌‌లో బలంగా పాతుకుపోయింది. 

ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్‌‌‌‌ని కమర్షియల్ వేలో చాలా గొప్పగా చూపించడానికి ప్రశాంత్ ప్రయత్నించారు. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్‌‌కి, మంచి లిరిక్స్ ఇచ్చిన సింహాచలంకి, అద్భుతంగా పాడిన సింగర్ సాహితికి  థాంక్స్.  పండక్కి హనుమాన్ తో థియేటర్లో పండగ చేసుకుందాం’ అన్నాడు.  ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమా  కోసం ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ ఇది. మొదటి రోజు షూటింగ్ కూడా ఈ పాటతోనే మొదలుపెట్టాం. 

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌‌‌‌తో సినిమాపై ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు రిలీజ్ చేసిన మూడో పాటతో సినిమాలో ఉన్న యాక్షన్,  మాస్, ఫన్ అన్నీ తెలుస్తాయి. సంక్రాంతికి రాబోతున్న సరైన సినిమా ఇది. చాలా చిన్న పిల్లల దగ్గర్నుంచీ, చాలా పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ చూసేలా ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఏమీ ఉండని క్లీన్ ఫ్యామిలీ మూవీ.  పిల్లలకు మాత్రం విపరీతంగా నచ్చుతుంది’ అని చెప్పాడు. నటుడు గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్,  లిరిసిస్ట్ సింహాచలం సహా టీమ్ అంతా పాల్గొన్నారు.