రిటైర్​మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు: హనుమంతు ముదిరాజ్

రిటైర్​మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు:  హనుమంతు ముదిరాజ్

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో 35 ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని టీజేఎంయూ నేత హనుమంతు ముదిరాజ్ అన్నారు. గతేడాది డిసెంబర్​లో రిటైర్ అయిన వారికి ఇంత వరకూ బకాయిలు చెల్లించలేదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 2013 నుంచి ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెరగలేదని, పీఆర్సీలు, డీఏలు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

ఆర్టీసీని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారని, ఇన్నేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధిచెప్పాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. సీసీఎస్  లోన్లు రాక ఉద్యోగులు బంగారం తాకట్టు పెట్టి లోన్లుతీసుకుంటున్నారన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగుల ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నికలు పూర్తయ్యాక విస్మరించారని ఆయన మండిపడ్డారు.