37ఏళ్ల వసంతంలోకి అనుపమ్ ఖేర్, కిరణ్ జంట

37ఏళ్ల వసంతంలోకి అనుపమ్ ఖేర్, కిరణ్ జంట

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన పెళ్లి రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన భార్యతో దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు.  ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు కిరణ్.. గత 37ఏళ్ల క్రితం జరిగిన తమ పెళ్లికి సంబంధించిన ఈ ఫొటోను ఇటీవల సిమ్లా వెళ్లినపుడు నాన్న గారి ట్రెజర్ ట్రంక్ లో లభ్యమైందని తెలిపారు. భగవంతుడు మీ అందరికీ సంతోషాన్ని, దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంటూ అనుపమ్ ఖేర్ రాసుకొచ్చారు.  విషెస్ తో పాటుగా  వారి పెళ్లిరోజు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఓ అరుదైన ఫోటోను కూడా షేర్ చేశారు.

1985లో అనుపమ్ ఖేర్, కిరణ్ ప్రేమ వివాహం జరిగింది. అనుపమ్‌ తో పెళ్లికి ముందే కిరణ్‌ కు గౌతమ్ బెర్రీ అనే ఒక వ్యక్తితో పెళ్లైంది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. అనంతరం అనుపమ్‌ తో పరిచయం..  ప్రేమగా మారి.. అది పెళ్లికి దారి తీసింది. దాంతో కిరణ్, గౌతమ్‌ కు విడాకులిచ్చింది. ఇకపోతే అనుపమ్‌ ఖేర్ చాలా బాలీవుడ్‌లో చాలా హిట్ సినిమాల్లో నటించాడు.