పరమ్ సుందరికి షెహజాదా బర్త్ డే విషెస్

పరమ్ సుందరికి షెహజాదా బర్త్ డే విషెస్

తెలుగులో మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో అందాల మెరుపు తీగ కృతి సనన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేడు కృతి 32వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నటుడు కార్తీక్ ఆర్యన్ ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ పిక్ ను షేర్ చేశారు. షూటింగ్ స్పాట్ లో కేక్ కట్ చేసి, కృతికి తినిపిస్తూ ఫొటోకు ఫోజులిస్తున్న ఓ ఫొటోను కార్తిక్ పోస్ట్ చేస్తూ.. డైట్ ను బ్రేక్ చేయలేదు. కేవలం ఫొటోకు మాత్రమే ఫొజులిచ్చిన పరమ్ సుందరి కృతి సనన్ కు ఈ షేహ్ జాదా తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అనే క్యాప్షన్ ను జత చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా నెటిజన్లు కూడా తమ స్ట్లైల్లో విషెస్ చెప్తూ కృతిని గ్రీట్ చేస్తున్నారు.

ఇక తెలుగులో వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఈ భామ.. నాగచైతన్యతో దోచెయ్ సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది.  ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ లేడీ భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ఇక ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో రానుంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో కృతి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు .