
ఈ రోజుల్లో ప్రతిదాన్ని మార్కులతో అంకెలతో కొలుస్తున్నారు. పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి. అంగట్లోకి సరుకుల కోసం వెళితే ఎన్ని కేజీలు కావాలి..ఇలా అన్నింటిని లెక్కల్లోనే కొలుస్తున్నారు. మరి జీవితం ఎంత హ్యాపీగా ఉందో ఎలా కొలవాలి.. దేనితో లెక్కించాలి.. మొదలగు విషయాలు తెలుసుకుందాం...
అవును ఈ రోజుల్లో అన్నింటిని లెక్కల్లోనే చూస్తున్నారు. మరి సంతోషాన్ని కొలిచే సాధనం ఏమైనా ఉందా అంటే.. ఉందని చెప్తున్నారు మానసిక నిపుణులు. సంతోషాన్ని కొలవాలంటే ముందు వాళ్ల వాళ్ల ప్రవర్తన గురించి తెలుసుకోవాలి. రోజులో ఎన్నిసార్లు కోపం తెచ్చుకున్నారు? ఎన్ని సార్లు ఒత్తిడికి గురయ్యారు? ఎన్ని సార్లు నవ్వారు? ఆ నవ్వు మనస్ఫూర్తిగా నవ్విందేనా,
లేక ఎదుటి వాళ్లకోసమో.... పని చేసే ప్రదేశంలో, ఇంట్లో, ఇతరులతో ఎలా ఉంటున్నాడు.. ఇలాంటివన్నీ లెక్కవేయాలంట. అయితే ఈ లెక్క ఎవరో వేస్తే కుదరదు. ఎవరికి వాళ్లే వేసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. అందుకోసం వారం రోజుల పాటు డైరీ రాయమని సూచిస్తున్నారు. ఉద్వేగాలను. సమయాన్ని, అప్పుడే చేసే పనులను క్రమపద్ధతిలో రాసుకుంటే సరిపోతుందట. వాటన్నింటిని గుర్తించి ఒక గ్రాఫ్ గీస్తే.. వాళ్లలో ఉన్న సంతోషం ఎంతో లెక్కకట్టొచ్చని అంటున్నారు. మరి ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారో లెక్కలు వేసుకుందాం..
–వెలుగు,లైఫ్–