Happy Life: సంతోషానికి పది సూత్రాలు.. ఇవి పాటిస్తే జీవితంలో ఇబ్బందే ఉండదు..!

Happy Life:  సంతోషానికి పది సూత్రాలు.. ఇవి పాటిస్తే జీవితంలో ఇబ్బందే ఉండదు..!

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ...ఆసంగీతం నీ తోడై హాయిగ సాగమే గువ్వమ్మా.... నవ్వే నీ కళ్లలో లేదా జాబిలి... ఇదోసినిమా పాట కష్టాన్ని కూడా తేలిగ్గా తీసుకుని, రేపటి గురించి ఆలోచించమని చెప్పే పాట... బతుకుబండి ఎప్పుడూ ఒకేలా సాగదు. ఎత్తుపల్లాలు వస్తుంటాయి. కుదుపులు ఉంటాయి. కానీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు. ఆనందంగా ఉండటానికి చక్కనైనా పది సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

చేసే పనికి రోజువారి జీవితానికే కాదు. మొత్తంగా జీవితానికి ఓప్రణాళిక ఉండాలి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి జీవిత ప్రణాళికలో భాగమే వాటికి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి. బాల్యంలో చదువు, యవ్వనంలో పెళ్లి, ఉద్యోగం, సంపాదనతోపాటు. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేయాలి. వృద్ధాప్యంలో నేర్చుకున్న జీవిత పాఠాలను నలుగురికి చెప్తూ, చేతనైనంత సాయం చేస్తూ బతికితే సంతోషం అనిపిస్తుంది. ప్రణాళిక లేకుండా ఏవని చేసినా విజయం సాధించడం కష్టమే. జీవితంలో సరైన ప్రణాళికతో వెళ్లేవాళ్లే సంతోషంగా ఉంటారు. క్రమం అనేది కిందనుంచి పైకి ఎదగడానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం ప్రణాళిక లేకుండా జీవించడం అంటే ఆనందాన్ని దూరం చేసుకున్నట్లే.

కుటుంబం: మనిషి ఒంటరి జీవి కాదు ప్రకృతి మనుషులు, సంబంధాల మధ్య బతుకుతాడు. అన్ని బంధాలకన్నా ఎక్కువ ప్రభావితం చేసేవి కుటుంబ సంబంధాలే. తల్లి, తండ్రి, తోడపుట్టినవాళ్లు, ఆ తర్వాత జీవిత భాగ స్వామి, పిల్లలు... ఇలా మనిషి పుట్టినప్పటి మంచి చనిపోయే వరకు అందరితో కలిసి మెలిసి బతకాలి. ఎంత పని ఒత్తిడిలో ఉన్న కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తే సంతోషంగా ఉంటారు. బాధలు, భావోద్వేగాలు, ఆలోచనలు... కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఆనందం ఎక్కువవుతుంది. కష్టాల్లో తోడు ఉండేది. అవసరానికి సాయం అందించేది కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే కుటుంబానికి  తగిన  సమయం కేటాయించాలి. అందమైన  కుటుంబం సంతోషాల నిలయం అది మర్చిపోకూడదు. . 

సంపాదన.. ఖర్చు...జీవితాన్ని ఒక్కోసారి ఆర్థికసమస్యలు చుట్టుముడతాయి. సంతోషాన్ని దూరం చేస్తాయి. మానసికంగా ఇబ్బంది పెడతాయి. అందుకే సంపాదనకు ఖర్చుకు మధ్య పొంతన ఉంచాలంటారు పెద్దలు. ఆదాయాన్ని బట్టి వ్యయం... ఆదాయాన్ని మించిన వ్యయం ఎప్పుడూ ప్రమాదమే. చాలామంది ఉద్యోగులు నెల మొదట్లో జీతం రాగానే అవసరాలు... అత్యవసరాలు, కోరికలు..అని పట్టించుకోకుండా ఖర్చు చేసేస్తారు. దాంతో నెల చివర వచ్చేసరికి అప్పులు చేయాల్సి వస్తుంది.

ఎప్పుడు, ఏ అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు . కాబట్టి సంపాదనలో కొంత పొదుపు చేసుకోవడం తప్పనిసరి. డబ్బు చేతిలో ఉన్నప్పుడు సంతోషాన్నిస్తుంది. అనారోగ్యం... అత్యవసర పరిస్థితుల్లో చేతిలో డబ్బు లేకపోతే కష్టమే. అందుకే సంపాదనను ప్రణాళికాబద్దంగా ఖర్చు పెట్టాలి.

కౌన్సెలింగ్​ :సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ...ఆసంగీతం నీ తోడై హాయిగ సాగమే గువ్వమ్మా.... నవ్వే నీ కళ్లలో లేదా జాబిలి... ఇదోసినిమా పాట కష్టాన్ని కూడా తేలిగ్గా తీసుకుని, రేపటి గురించి ఆలోచించమని చెప్పే పాట... బతుకుబండి ఎప్పుడూ ఒకేలా సాగదు. ఎత్తుపక్షాలు వస్తుంటా

జీవితం అన్నాక సమస్యలు వస్తుంటాయి. .పోతుంటాయి. వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు అంటారు మానసిక నిపుణులు. కొందరు సమస్య తీవ్రతను బట్టి కాకుండా చిన్నవాటిని కూడా పెద్దగా ఆలోచించి మనసు పాడుచేసుకుంటారు. ఆత్మీయులు దూరమవడం .. ఆర్థికపరమైన ఇబ్బందులు..  రోగాలు, పని ఒత్తిడి లాంటివి మనసుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి వాటి నుంచి బయపడక కపోవచ్చు. అలాంటి వారికి కౌన్సెలింగ్ అవసరం అప్పుడప్పుడు మనసుకు ఒంటరితనం ఆవరించి, ఏదో కోల్పోయామన్న బాధ కలుగుతుంది. అలాంటి సమయాల్లో ఎవరికి వాళ్లే కౌన్సెలింగ్ ఇచ్చుకోవాలి మనసుకు నచ్చచెప్పుకోవాలి. సమస్య ఎక్కడుందో దాని గురించి ఆలోచిస్తే వాటి నుంచి బయటపడి.. మామూలు మనిషిగా మారొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ మనసు అదుపుతప్పుతున్న
ప్పుడు కౌన్సెలింగ్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

నచ్చినట్లు: ఎవరికి నచ్చినట్లు వాళ్లు బతికితే సగం సంతోషంగా ఉన్నట్లే. మనిషి ఎదిగే క్రమంలో సొంతవైన ఇష్టాలు, అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. ఎలా బతకాలో, ఎలాంటి ఉద్యోగంచేయాలో, ఎలాంటి వాతావరణంచుట్టూ ఉండాలో, తోటి వారితోఎలామెలగాలో... అన్నింటిగురించి అవగాహనకువస్తాడు. సమస్య వచ్చినప్పుడో, ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడో ఎంతమందిని  సలహా అడిగినా మనసు చెప్పినట్లు వినమని పెద్దలు చెప్తారు. నచ్చినట్లు బతికితే సంతోషంగా ఉంటారు. ప్రతి అంశంపై స్పష్టమైన ఉద్దేశం ఉంటే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడాల్సి రాదు. వస్త్రాలు పని, నిద్ర, బంధాలు... అన్నీ నచ్చినట్లు  ఉండేలా చూసుకున్నవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉంటారు.  అలా బతికే వాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. నచ్చిన లక్ష్యం కోసం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. మనసు చెప్పినట్లు నడుచుకున్న వాళ్లే ఎక్కువ ఆనందంగా ఉంటారని మనో విశ్లేషకులుచెప్తారు.

అదుపు: చిన్న నవ్వుతో ప్రపంచాన్ని గెలవచ్చు అన్నది. పెద్దలు చెప్పినమాట..  కోపం, అసూయ కన్నా ప్రేమ, అభిమానాలు సంతోషాన్ని ఇస్తాయి. ఇతరులకు దగ్గర చేస్తాయి. ఓర్పు, నేర్పు, మంచి మాట ప్రతి ఒక్కరికి అవసరం. అలాగని, అవి మితిమీరితే కష్టం ఎప్పు టికప్పుడు మనసులో కలిగి భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. సమయం, సందర్భం లేకుండా, పెద్దవాళ్ల ఎదుట ఉద్వేగాలు ప్రదర్శిస్తే కష్టాల పాలుగాక తప్పుదు.  ఆశ  వేరు... అత్యాశ వేరు. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తుంటే మనిషి వాటిని ఎప్పటికప్పుడు కల్లెం వేసి ఆపాలి. లేదంటే జీవితాన్ని నాశనం చేస్తాయి. మాట, ప్రవర్తనా ప్రతి ఒక్కదానిపై అదుపు ఉండాలి. అప్పుడే మనిషి సంతోషంగా ఉండగలరు.

అహం:ప్రతి ఒక్కరిలో అహం ఉంటుంది. నాది... నేను, నేనే గొప్ప. నా కంటే ఇతరులు తక్కువ నాకే తెలివి తేటలు ఎక్కువ... ఇలాంటి మనిషిని కిందకు నెట్టేస్తాయి. తప్ప, పైకి ఎదగనివ్వవు. అహంతో గొప్పలకు పోయి ఇతరులను తక్కువ చేయడం వల్ల ఆత్మీయులు దూరమవుతారు. సున్నితమైన మనసు ఉన్నవాళ్లు ఇతరుల అహం వల్ల బాధపడతారు.. కాబట్టి అహం వదిలి పెడితే సంతోషం సొంతం అవుతుంది. ఎక్కడ ఎదగాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అంటే అహం వదిలేయాలి. అందరిలో ఒకరిలా కలిసిపోవాలి. అవసరం అయితే అందరిని తనవాళ్లు అనుకోవాలి అహం లేని వాళ్ల అందరూ బంధువులే.  అందుకే సంతోషానికి అహం ఎప్పుడూ అడ్డంకే. కాబట్టి సంతోషంగా జీవించాలనుకుంటే అహాన్ని వదిలేయాలి.

ఇవ్వడం... తీసుకోవడం:జీవితంలో చాలా అంశాలలో ఇలానే ఉంటాను.... ఇదేకరెక్ట్​ అనే పద్ధతి పనికిరాదు..  అవసరాన్ని బట్టి ఇతరులతో కలవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి మనిషిని సంతోషంగా ఉంచుతుంది. మానవ సంబంధాలలోనే మనిషికి తృప్తి కలుగుతుంది . బాధలు కష్టాలు ఇతరులతో వంచుకుంటే సగం తగ్గుతాయంటారు. ఇతరుల ఆనందంలో బాధలు పంచుకోవటం... సమస్యలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం సంతోషాన్నిస్తుంది. జీవితం అంటేనే పదిమందితో కలిసి బతకడమే తప్ప... ఒంటరితనం కాదని చెప్తారు . ఎవ్వరిని శత్రువులుగా చేసుకోకూడదు. సంతోషాన్ని చుట్టూ ఉన్నవా ళ్లకు పంచుతూ తనూ సంతోషంగా ఉండటమే జీవితం అర్థం. ఇచ్చిపుచ్చుకునే అలవాటు ఉంటే ఎప్పటికీ ఒంటరితనంతో బాధపడరు. ఆనందంగా జీవిస్తారు.

థింక్ పాజిటివ్:ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించడం చెల్ల మనను ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుం దా పరిష్కారం ఆలోచించొచ్చు. ప్రతి ఆలోచనను పాజిటివ్​ నెస్ ప్రభావితం చేస్తుంది. ఓటమిలో ధైర్యంగా ఉంచుతుంది. మాన సికంగా ధృడంగా ఉంచుతుంది. ప్రతి రోజూ నిద్రలేవగానే పా జిటివ్ గానే ఉంటాను అనుకుంటే ఉత్సాంగా ఉంటారు. చదువు. పని, మానవ సంబంధాలు... ప్రతి విషయాన్ని నెగటివ్ సెన్సేతో కాకుండా పాజిటివ్ తో చూస్తే ఆనందంగా ఉంటారు. అబద్దాలు చెప్పడం, నిండలు వేయటం లాంటి వ్యక్తిత్వం సంతోషాన్ని దూరం చేస్తుంది. ఉత్తేజంగా ముందుకు వెళ్లడానికి థింక్​పాజిటివ్​ ధోరణి బాగా ఉపయోగపడుతుంది.

సరదాగా:ప్రతి క్షణాన్ని ఆశ్వాదించే స్వభావం ఉన్నవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చుట్టు అనుకూలమైన వాతావరణం లేకపోయినా సున్నితమైన హాస్యంతో దాన్ని మార్చివేయాలి. సరదాగా, హాయిగా తోటి వాళ్లతో గడపాలి. ఆహ్లాదంగా చేయాలి. రోజువారీ జీవితం అప్పుడప్పుడు బోర్ కొడుతుంది. అలాంటప్పుడు కొత్త ప్రదేశాలు చూసి రావడం వల్ల ప్రశాతంత వస్తుంది... చిన్ననాటి స్నేహితులను, దగ్గర బంధువులను కలిసినా ఆనందంగా అనిపిస్తుంది. గడిచిన జీవితంలోని సంతోషాలను గుర్తు చేసుకుంటే మనసు తేలికపడి సంతోషంగా మారుతుంది. జ్ఞాపకాలు మానసికంగా ఉత్సాహాన్ని స్తాయి. పరుగు పెట్టడం కంటే ఉన్నదానిలో హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. సరదాగా, సున్నితంగా ఆలోచించేవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.

వెలుగు,లైఫ్​